పంత్​ సెంచరీ..భారత్​కు లీడ్​

అహ్మదాబాద్​ : ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్​లో వికెట్​ కీపర్​ రిషబ్​పంత్​ సెంచరీ చేశాడు. టెస్టులో అతనికి మూడో సెంచరీ. 116 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సర్లతో ఈసెంచరీ చేశాడు. మొదట్లో వికెట్​ కాపాడుకునే ఉద్దేశంతో మెల్లగా ఆడిన పంత్​ హాఫ్​ సెంచరీ పూర్తయిన
తర్వాత ఒక్కసారిగా దూకుడు పెంచాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్​ కొత్త బాల్ తీసుకున్న తర్వాత వరుస ఫోర్లతో చెలరేగిపోయాడు. దీంతో భారత్​ కీలకమైన మొదటి ఇన్నింగ్స్​ ఆధిక్యం దక్కింది. అయితే ఆ వెంటనే ఆండర్సన్​ బౌలింగ్​లో101 పరుగుల దగ్గర ఔటయ్యాడు. వాషింగ్టన్​ సుందర్​తో కలిసి పంత్​ ఏడో వికెట్ కు113 పరుగుల పార్ట్​నర్​షిప్​ చేశాడు. మరోవైపు సుందర్​ కూడా హాఫ్​ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతనికి మూడో హాఫ్​ సెంచరీ.

ads