అహ్మదాబాద్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత్ వికెట్ కీపర్ రిషబ్‌పంత్ హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టులో ఆయనకిది ఏడో అర్ధ సెంచరీ. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి టీమ్ ను ఆదుకున్న అతడు ఇప్పడు ఆధిక్యం అందించేకు కృషి చేస్తున్నాడు. ఒక దశలో 146 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను మెల్లగా ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు (205) వైపు తీసుకెళ్తున్నాడు. అతనికి సుందర్ మంచి పార్టనర్షిప్ ఇస్తున్నాడు. మరీ మూడో టెస్ట్ అంత కాకపోయినా అహ్మదాబాద్ పిచ్ ఇప్పటికీ బౌలర్లకే సహకరిస్తోంది. దీంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియన్ టీమ్ మంచి ఆధిక్యం సాధిస్తే మ్యాచ్‌పై పట్టు దొరుకుతుంది.
