విశాఖ జిల్లా : పట్టణంలోని ఎన్ఏడీ ఫ్లై ఓవర్పై ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లై ఓవర్పై పెయింటింగ్ పనులు చేస్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పెయింటర్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.
Home News




