కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లా : ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్‎తో వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే రోజా మరోసారి హాట్ ఆఫ్ ది న్యూస్ గా మారారు. ఆంధ్రప్రదేశ్‎లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గెలుపు కోసం ఎమ్మెల్యే రోజా రంగంలోకి దిగారు. ప్రతీ గల్లీ, ప్రతీ ఇల్లు తిరుగుతూ వైసీపీని గెలిపించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా నిండ్రలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కబడ్డీ పోటీను ఆమె ప్రారంభించారు. అనంతరం బరిలోకి దిగి కుర్రాళ్లతో కబడ్డీ ఆడారు.

ads