రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్

జైపూర్ : ఐపీఎల్ టీం రాజస్థాన్ రాయల్స్ కొత్త సీజన్ కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం రాత్రి జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచ్ కళ్లు చెదిరే రీతిలో జరిగింది. ఈ జెర్సీని ఆవిష్కరించడం కోసం స్టేడియంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ముందు ఓ వీడియో మాంటేజ్ ప్లే చేసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ త్రీడీ ప్రొజెక్షన్స్ రూపంలో కొత్త జెర్సీల్లో కనిపించారు. ఇప్పటికే మిగతా టీమ్స్ జెర్సీ లాంచ్ లను నిర్వహించినప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ జెర్సీ లాంచే అద్భుతంగా ఉన్నదని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న రాజస్థాన్ టీం, ఈ నెల 12న పంజాబ్ కింగ్స్ తో తొలి మ్యాచ్ ఆడనుంది.

ads