పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో చిత్రాలు నిర్మిస్తున్న ఐదుగురు నిర్మాతలు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భారీ విరాళం అందజేశారు. ఎఎం రత్నం (మెగా సూర్య ప్రొడక్షన్స్), ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్), నవీన్ ఎర్నేని (మైత్రి మూవీ మేకర్స్), బండ్ల గణేష్ (పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్) కలసి రూ. 54 .51 లక్షల విరాళాన్ని అయోధ్య రామ మందిరానికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూ.30 లక్షలు విరాళాన్ని చెక్కు రూపంలో తిరుపతిలో అందించిన విషయం విధితమే. ఆ స్ఫూర్తితోనే నిర్మాతలు ఈ విరాళం అందజేశారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శుక్రవారం నిర్మాతలు ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ బాఘ్ సంఘ్ చాలక్ డాక్టర్​ వేదప్రకాష్, నిర్మాత శ్రీ ఎ దయాకర్ రావు పాల్గొన్నారు.