టీచర్స్ జాగ్రత్తలు తీసుకోవాలి

కరీంనగర్​ జిల్లా : తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అన్నారు. బుధవారం గంగాధర మండలం గర్షకుర్తి ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడాలని చెప్పారు. మాస్కులు తప్పకుండా వాడాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ విద్యార్థులకు సూచించారు.