సైనా, కిడింబి శ్రీకాంత్ శుభారంభం

హైదరాబాద్ : ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ బ్యాడ్మింటన్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో సైనా 21-9, 21-5 తేడాతో రాచెల్ దరాగ్ ( ఫ్రాన్స్ ) పై 21 నిమిషాల్లోనే అలవోకగా గెలిచింది. నాలుగోసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉన్న సైనా ర్యాంకింగ్స్ పాయింట్లు దక్కించుకొని రేసులోకి రావాలని భావిస్తున్నది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో బై దక్కించుకున్న శ్రీకాంత్ తదుపరి పోరులో భారత్ కే చెందిన అజయ్ జయరామ్ ను 21-15, 21-10తో ఓడించి ప్రిక్వార్టర్స్ కు చేరాడు. హెచ్ఎస్ ప్రణయ్ కు కిరణ్ జార్జ్ షాకిచ్చాడు. మిక్స్ డబుల్స్ లో ఎన్.సిక్కిరెడ్డి, ప్రణవ్ జెర్రీ చోప్రా ద్వయం విజయం సాధించి ముందడుగేసింది.

ads