జూన్ 3న గుడ్ ల‌క్ స‌ఖి’

ads

హైదరాబాద్​ : జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘గుడ్ ల‌క్ స‌ఖి’. ఆది పినిశెట్టి హీరోగా న‌టిస్తుండ‌గా, జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. విమ‌న్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి స‌హ నిర్మాత శ్రావ్య వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో ఎక్కువ మంది లేడీ టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తుండ‌టం గ‌మ‌నార్హం. న‌గేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక కాలంలో నిర్మాణ‌మ‌వుతోంది.

పాపుల‌ర్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్పిస్తోన్న ‘గుడ్ ల‌క్ స‌ఖి’ని వ‌ర్త ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్ చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 3న విడుద‌ల చేస్తున్న‌ట్లు ఒక రిలీజ్ డేట్ పోస్ట‌ర్ ద్వారా సోమ‌వారం చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఆ పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ ఓ గ‌న్ ప‌ట్టుకొని చిరునవ్వులు చిందిస్తుండ‌గా ఆమెకు చెరోవైపు జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి నిల్చొని ఉన్నారు.

స్పోర్ట్స్ రోమ్‌-కామ్‌గా రూపొందుతొన్న ఈ మూవీలో కీర్తి సురేష్ ఒక షూట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు.
రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తుండ‌గా, చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు అన్ని వ‌ర్గాల నుంచీ ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది.

తారాగ‌ణం:
కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌కృష్ణ‌, ర‌మాప్ర‌భ త‌దిత‌రులు.

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌ : న‌గేష్ కుకునూర్‌
స‌మ‌ర్ప‌ణ‌ : దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
ప్రొడ్యూస‌ర్‌ : సుధీర్ చంద్ర పాదిరి
బ్యాన‌ర్‌ : వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్‌
స‌హ నిర్మాత‌ : శ్రావ్య వ‌ర్మ‌
మ్యూజిక్‌ : దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ : చిరంత‌న్ దాస్‌
పీఆర్వో : వ‌ంశీ-శేఖ‌ర్‌.