‘టాప్స్’ లో సానియాకు దక్కిన చోటు

న్యూఢిల్లీ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ( టాప్స్ )లో తిరిగి చోటు దక్కింది. మిషన్ ఒలింపిక్ సెల్ 56వ సమావేశం సందర్భంగా సానియాను టాప్స్ లో చేరుస్తూ సాయ్ నిర్ణయం తీసుకుంది. దీంతో నాలుగేండ్ల తర్వాత ఈ 34 ఏండ్ల హైదరాబాదీకి మళ్లీ అవకాశం దక్కింది. 2017లో టాప్స్ నుంచి వైదొలిగిన సానియా.. తల్లి కావడంతో దాదాపు మూడేండ్ల పాటు టెన్నిస్ టోర్నీలకు దూరమైంది. బాబుకు జన్మనిచ్చిన తర్వాత గత యేడాది నదియా కిచెనోక్ తో కలిసి సానియా మీర్జా, హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ads