ఎస్‎బీఐ బంపర్ ఆఫర్


న్యూఢిల్లీ : ఇల్లు కొనాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‎బీఐ) ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ యేడాది మార్చి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. అంతేకాదు ఏడాదికి కనిష్ఠంగా 6.8 శాతం వడ్డీతో హోంలోన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎస్‎బీఐ వివిధ హోంలోన్లను అందిస్తోంది. అందులో సాధారణ హోంలోన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎస్‎బీఐ ప్రివిలెజ్ హోంలోన్, ఆర్మీ, రక్షణ రంగ సిబ్బందికి ఎస్‎బీఐ శౌర్య హోంలోన్‎లతో పాటు ఎస్‎బీఐ స్మార్ట్‎హోం, ఎస్‎బీఐ ఎన్నారై హోంలోన్ లాంటివి అందిస్తోంది.

కొత్తగా హోంలోన్ కావాలని అనుకునే వాళ్లు 7208933140 నంబర్‎కు మిస్ కాల్ ఇస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని ఎస్‎బీ‎ఐ వెల్లడించింది. అతి తక్కువ వడ్డీరేట్లతో ఇప్పటికే దేశంలో హోంలోన్ షేర్‎లో 34 శాతం వాటా ఎస్‎బీఐ‎దే కావడం విశేషం. సగటున రోజుకు వెయ్యి మంది హోంలోన్ కస్టమర్లు వస్తున్నట్లు ఆ బ్యాంకు తెలిపింది.

హోంలోన్ బిజినెస్‎లో ఎస్‎బీఐ ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల మార్క్‎ను అందుకోవడం విశేషం. 2024 కల్లా దీనిని రూ.7 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగానే అతి తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీలాంటి ఆఫర్లు ఇస్తోంది.