ఎస్‎బీఐలో మేనేజర్ పోస్టులు

న్యూఢిల్లీ : ఎస్‎బీఐలో ఖా‎ళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కల్గిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.

పోస్టు : మేనేజర్ ( రిటైల్ ప్రొడక్ట్ )

అర్హత : ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ : దరఖాస్తు చేసుకున్నవారి విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‎లైన్ లో

అప్లికేషన్ ఫీజు : రూ.750, ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 12

వెబ్ సైట్ : https://bank.sbi/careers