ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

మహబూబ్ నగర్ జిల్లా: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చెంచు పెంటల జీవన విధానం, వారి స్థితి గతులు గురించి తెలుసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం శనివారం పర్యటనకు బయల్దేరింది. నల్లమల్ల ఫారెస్ట్ పర్యటనలో భాగంగా మున్ననూర్ క్యాంప్ ఆఫీస్ లో కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మరియు కమిషన్ సభ్యులు కరోనా టెస్టు చేయించుకున్నారు.

అనంతరం అమ్రాబాద్ టౌన్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమ్రాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్​ను సందర్శించారు కమిషన్​ సభ్యులు. పోలీస్ స్టేషన్ లోని షటిల్ కోర్టు ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో ప్రారంభించారు. తదనంతరం స్థానిక ఎస్సీ ఎస్టీ కేసులను ఎలా విచారిస్తున్నారు.. మరియు పరిష్కరిస్తున్నారు ? అని పోలీస్ స్టేషన్ లో అధికారులను అడిగి తెలుసుకున్నారు కమిషన్​ చైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​. తర్వాత జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొని పోలీస్ శాఖ మరియు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.