ఎస్సీ స్టూడెంట్స్ కి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు రిలీజ్

న్యూఢిల్లీ : కేంద్ర సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ కు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం 2021-2022 విద్యాసంవత్సరానికిగానూ అర్హులైన ఎస్సీల నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదువుతున్న కోర్సుల ఆధారంగా ప్రతీ సంవత్సరం రూ.2500 నుంచి రూ.13,500 వరకు అందిస్తారు. ఇలా 5 సంవత్సరాల్లో మొత్తం రూ.63 లక్షలు చెల్లిస్తారు.

ads

అర్హత : ఇంటర్ పాసై ఆపై ఉన్నత విద్య చదువుతున్న వారై ఉండాలి. ఎస్సీ విద్యార్థులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5లక్షలు మించకూడదు.

దరఖాస్తు : ఆన్లైన్ లో

దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 30

వెబ్ సైట్ : www.socialjustice.nic.in