వకీల్ సాబ్ కు కరోనా దెబ్బ

హైదరాబాద్ : పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రతీ ఒక్కరిని అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తొలి వారంలో ప్రేక్షకులు థియేటర్స్ కు బారులు తీరారు. కాని రెండోవారం వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారాయి. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటంతో థియేటర్స్ కు వెళ్లేవారి సంఖ్య కరువైంది. ఈ శుక్ర, శనివారాలలో తెలుగురాష్ట్రాలలో కలెక్షన్స్ భారీగా పడిపోయినట్లు తెలుస్తుంది.

ads

ఓ ప్రక్క స్టార్ హీరో చిత్రం, అందులోనూ వకీల్ సాబ్ చిత్రం హిట్ టాక్ దక్కించుకుంది. అయినప్పటికీ థియేటర్స్ కు జనాలు రావడం తగ్గింది. ఈ పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజులలో విడుదలకానున్న చిన్న సినిమాల పరిస్థితి ఏంటనేది అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. వకీల్ సాబ్ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరతెక్కించారు. కాగా, దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ , అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రలు పోషించారు.