మహేష్‎బాబు దుబాయ్ ట్రిప్ సీక్రేట్..!

హైదరాబాద్ : ఇటీవలే యూఎస్ నుంచి తిరిగొచ్చిన మహేష్ బాబు అతని కుటుంబసభ్యులు మళ్లీ ఫారిన్ ట్రిప్ వేశారు. యూఎస్ నుంచి తిరిగిరాగానే మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ అవుతాడని అభిమానులు భావించారు. కానీ మహేష్ మాత్రం హఠాత్తుగా భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యేసరికి ఫోటోగ్రాఫర్లు వారిని క్లిక్ మనిపించారు.అసలు విషయానికొస్తే జనవరి 22న మహేష్ సతీమణి నమ్రత పుట్టినరోజు. దుబాయ్‎లో నమ్రత బర్త్ డే సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేశాడట మహేష్. ఇంకో విషయమేమిటంటే ఈ సూపర్ స్టార్ ఓ వైపు భార్య నమ్రత పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుతూనే, మరోవైపు ఫ్యాన్స్ కోసం సర్కార్ వారు పాట చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు.దుబాయ్ లో జనవరి 29న లేదా ఫిబ్రవరి మొదటి వారంలో షూటింగ్ మొదలు కానుందని సమాచారం. డైరెక్టర్ పరశురాం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాడు. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్‎గా నటిస్తోండగా, షూటింగ్ కోసం డేట్స్ కూడా కేటాయించిందట. మహేష్ ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.