ఓట్లు లెక్కింపు కేంద్రం పరిసరాల్లో సెక్షన్ 144

వరంగల్ అర్బన్ జిల్లా : నిన్న జరిగిన జీ.డబ్యూ.ఎం.సి ఎన్నికల కౌంటింగ్ మే 3న జరుగనుంది. ఈ నేపథ్యంలో రాంపూర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో జరిగే ఓట్ల లెక్కింపు దృష్యా లెక్కింపు కేంద్రం పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో వుంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ads

ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు సీపీ చర్యలు తీసుకున్నారు. ఈ నెల 3 న ఉదయం 6గంటల నుండి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు లెక్కింపు కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ ను అమలు అవుతుందని సీపీ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అనుసరించి, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సీపీ కోరారు. ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.