అఖిలప్రియకు బెయిల్‌

హైద‌రాబాద్‌ : కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు సికింద్రాబాద్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 10 వేల పూచీకత్తు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. రేపు జైలు నుంచి అఖిల ప్రియ విడుదలయ్యే అవకాశం ఉంది .

అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ వ్యవహారంలో పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌పై న్యాయస్థానం శుక్ర‌వారం విచారించింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్నఅఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. అయితే అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసిన విషయం విదిత‌మే.