భారీ పేలుడు సామగ్రి స్వాధీనం

విశాఖ జిల్లా : చిత్రకొండ స్వాబిమాన్ అటవీ ప్రాంతంలోని హంటల్‌గుడలో బీఎస్ఎఫ్ బలగాలు ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుకి చెందిన పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు నిర్వహించింది. ఈ గాలింపు చర్యల్లో చిత్రకొండ బ్లాక్ హంటల్ గూడ అటవీ ప్రాంతంలోని కదలిబంధ గ్రామానికి సమీపంలో ఉన్న కొండ సమీపంలో మావోయిస్టులు దాచి ఉంచిన బ్యాగ్‎ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బ్యాగ్ నుండి రెండు ప్రెషర్ మైన్స్, ఒక టిఫిన్ బాంబు మరియు ఇతర వస్తువులను బిఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఘటనా స్థలానికి బీఎస్ఎఫ్ బాంబు నిర్మూలన బృందం వచ్చి బాంబును పేల్చింది. గత కొన్ని రోజులుగా, స్వాబిమాన్ ప్రాంతంలోని బీఎస్ఎఫ్ పోలీసులు మావోయిస్టు ప్రణాళికను వివిధ సమయాల్లో అడ్డుకుంటున్నారు.