రోడ్డు ప్రమాదంలో యువకులకు తీవ్ర గాయాలు

జనగామ జిల్లా : దేవరుప్పుల మండలం, గొల్లపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గొల్లపల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి ప్రక్కన వ్యవసాయభూమిలో ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో ఆ కారులో డ్రైవర్ తో సహా ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని 108 కి , పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ లో క్షతగాత్రులను జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ads