నేటి నుంచి పోస్టాఫీసుల ద్వారా ఆర్జిత సేవలు

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవస్థానాల్లో గోత్ర నామాలతో అర్చన, అభిషేకాలు, ప్రసాదాలు పొందడం తదితర ఆర్జిత సేవలను పోస్టాఫీస్ శాఖ శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణ పరిధి అన్ని సర్కిళ్లలోని పోస్టాఫీసుల్లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు నార్త్‌ సబ్‌డివిజన్‌ సహాయ సూపరింటెండెంట్‌(పోస్టాఫీసులు) సత్యేంద్ర కృష్ణ తెలిపారు. యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, బాసర, కొండగట్టు, కొమురవెల్లి, బల్కంపేట, గణేష్‌, ఉజ్జయిని మహంకాళి ఆలయాలు(సికింద్రాబాద్‌), కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ దేవస్థానాలకు సంబంధించిన సేవలను, ప్రసాదాన్ని పోస్టాఫీసుల ద్వారా పొందే వీలుంది.

ads