సేవాలాల్ జయంతిని జయప్రదం చేయాలి

హైదరాబాద్​ : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ని జయప్రదం చేయాలని గిరిజన నాయకులు కోరారు. ఈ నెల 15వ తేదీన సేవాలాల్​ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో శుక్రవారం ఉత్సవాల పోస్టర్​ను ఆవిష్కరించారు. సేవాలాల్ జయంతిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ , గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో తెలంగాణ భవన్ లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గిరిజనులకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అనేక కార్యక్రమాలు వారి సంక్షేమానికి అమలు చేస్తున్నారని నాయకులు కొనియాడారు. తండాలను గ్రామాలు చేసి స్వయం పాలన అవకాశం కల్పించారని, గిరిజనుల సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజెప్పేలా బంజారా భవన్ నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణలో మ్యూజియాలు నిర్మించి సంస్కృతిని భావితరాలకు అందిస్తున్నారన్నారని గిరిజన నేతలు చెప్పారు.

ఈ పోస్టర్​ ఆవిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్ గిరిజన నేతలు రూప్ సింగ్, రమణా నాయక్, రామచంద్రు నాయక్, శ్రీరామ్ నాయక్, సుందర్ నాయక్, అనితా నాయక్, నెహ్రూ నాయక్, కరాటే రాజు నాయక్, తిరుపతి నాయక్, ఆంజనేయులు, మధు పాల్గొన్నారు.