నామినేషన్ వేసిన షబ్బీర్ అలీ

నల్లగొండ: వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ ప్రయివేట్ టీచర్స్ ఫోరమ్ ( టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు నాగార్జున డిగ్రీ కళాశాల మైదానం నుంచి క్లాక్ టవర్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రయివేట్ టీచర్లు, షబ్బీర్ అలీ మద్దతుదారులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ప్రయివేట్ టీచర్ల, పట్టభద్రుల సమస్యలపై అలుపెరుగని పోరాటం నిర్వహిస్తున్న తనకు శాసనమండలి ఎన్నికల్లో తొలి ప్రాధాన్యం ఓటు నమోదు చేయాలని ఆయన అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మధుమూర్తి ,సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వీరబోయిన వెంకట్ , రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాథోడ్, సంజీవ రెడ్డి , సోమయ్య,మహమూద్ అలీ, రాజశేఖర్, వెంకట్, గొట్టె నాగరాజు, ఉమర్, హాజీబాబా, ఫెరోజ్, విజయ్ రెడ్డి, మహాబూబ్ అలీ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.