‘ధ‌ర్మ‌స్థ‌లి’ టైటిల్​ ఖరారు

ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ధ‌ర్మ‌స్థ‌లి మెద‌టిలుక్ విడుద‌ల‌హైదరాబాద్​ : కమెడియ‌న్ గా కామెడీ హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ఒక బాధ్యాతాయుత‌మైన మంచి పాత్ర‌లో హీరోగా క‌నిపిస్తున్న చిత్రం ధ‌ర్మ‌స్థ‌లి. ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల తెలిసిన ర‌మ‌ణ మోగిలి ద‌ర్శ‌కుడు. పావ‌ని హీరోయిన్ గా శంక‌ర్ కి జోడిగా న‌టిస్తుంది. వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ధ‌ర్మ‌స్థ‌లి అని టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ టైటిల్ వెన‌క క‌థ స‌మాజం లో జ‌రిగే విషం లాంటి ఒక విష‌యాన్ని అంద‌రికి అర్ధ‌మ‌య్యేలా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి తెర‌కెక్కిస్తున్నారు. ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఈ విష‌యాన్ని అంద‌రికీ అర్థమ‌య్యేలా వుంటుంది అందుకే ఈ ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ కి ఖ‌రారు చేశారు.

‘ష‌క‌ల‌క శంక‌ర్ తో ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి చిత్రాన్ని ఇలాంటి కాన్సెప్ట్ ని ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు. ఆయ‌న‌లో వున్న కామెడీ టైమింగ్ చూసిన వారికి ఆయ‌న‌లో వున్న ఇంటెన్సిటి ఈ చిత్రం ద్వారా అర్థమ‌వుతుంది. ప్ర‌తిరోజు మ‌న జీవితాల‌తో ముడి ప‌డిన ఓ విష‌యాన్ని అలాగే మ‌న జీవితాల‌తో ఆడుకుంటున్న అంశాన్ని ఆయ‌న పాత్ర ద్వారా తెలియ‌జేస్తున్నాం. ఆయ‌న‌లో వున్న కామెడీ టైమింగ్ మిస్ కాకుండా ఇంటెన్సిటి ని తెర‌పైకి తీసువ‌స్తున్నాం’ అన్నారు దర్శకుడు రమణ మోగిలి.

‘ ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే అంశాలు ఈ చిత్రం లో వున్నాయి. ఇంత మంచి చిత్రానికి ద‌ర్శ‌స్థలి అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయ‌గానే భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు వ‌చ్చిన రెస్పాన్స్ రావ‌టం విశేషం. మ‌రిన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం. ఈ రోజు ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్ ని విడుద‌ల చేశాము’ అన్నారు ఎగ్జిక్యూటివ్​ ప్రొడ్యూసర్​ ఆకుతోట సంజు.

న‌టీన‌టులు : శంక‌ర్‌, పావ‌ని, మ‌ని భ‌ట్టాచార్య‌, స‌న్ని సింగ్‌, షియాజి షిండే, ధ‌న‌రాజ్‌, భూపాల్‌, భర‌త్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ముక్తార్‌, ఉన్ని కృష్ణ‌, ఘ‌ని, విజ‌య్ భాస్క‌ర్‌, మాధ‌వి, హాసిని, ర‌మ్య‌, స్వాతి త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు : రోచిశ్రీ మూవీస్
నిర్మాత‌ : యమ్ఆర్ రావు
స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌కుడు : ర‌మ‌ణ మోగిలి
మ్యూజిక్‌ : వినోద్ యాజ‌మాన్య‌
స్టోరీ, స్క్రీన్‌ప్లే, మాట‌లు : రాజేంద్ర భ‌రధ్వాజ్‌
కెమెరా : జీ ఎల్ బాబు
ఎడిట‌ర్ : వీ నాగిరెడ్డి
వీ ఎఫ్ ఎక్స్‌ : అనంత్ ఇయ్యిని
ఫైట్స్‌ : మ‌ల్లేష్‌
డ్యాన్స్‌ : చంద్ర కిర‌ణ్‌
ఆర్ట్‌ : సాంబ‌
లిరిక్స్‌ : గోసాల రాంబాబ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ : అకుతోట సంజు