పోలీసుల అదుపులో యూట్యూబ్ ఫేమ్

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో రోడ్డు ప్రమాదం సంభవించింది. యూట్యూబ్ ఫేమ్, టిక్ టాక్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ నడుపుతున్న కారు అదుపుతప్పి మరో రెండు కార్లు, రెండు బైకులను ఢీకొట్టింది. ఈప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ప్రమాదానికి కారణమైన షణ్ముక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారంగా పోలీసులు తెలిపారు.

ads