ముంబై ఇండియన్స్ కు షాక్ ..

చెన్నై : ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కరోనా బారినపడటం ఆందోళన కల్గిస్తోంది. తాగాజా భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోర్ కు కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ మంగళవారం తెలిపింది. ముంబై జట్టు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్ గా కిరణ్ కొనసాగుతున్నారు.

ads

‘మోర్ కు ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్, కిరణ్ మోర్ బీసీసీఐ హెల్త్ గైడ్ లైన్స్ పాటిస్తున్నాం. బీసీసీఐ ప్రోటోకాల్స్ కు కట్టుబడి ఉన్నాం. ముంబై మెడికల్ టీం మోర్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మా టీం అభిమానులందరూ సురక్షితంగా ఉండాలని, ప్రతీ ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నట్లు’ ముంబై ఫ్రాంఛైజీ ట్వీట్ చేసింది.