హాట్ సీటు కోసం పోటీ!


ముంబై: ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచే బాలీవుడ్ భామల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటారు శ్రాద్ధాకపూర్, నోరా ఫతేహి. ఈ ఇద్దరు బ్యూటీలు బ్లాక్ డ్రెస్ లో ఉన్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెంట్ అవుతున్నాయి. ఆడ్నేవిక్, హిలా, క్రిస్టియన్ డిజైన్ చేసిన ‎‎‎ఔట్ ఫిట్ బ్లాక్ వెల్వెట్ గౌన్ మెటల్ చైన్ కాంబో డ్రెస్ లో శ్రద్దాకపూర్ మెరిసిపోతుంది.

ఇక నోరా ఫతేహి కూడా సేమ్ బ్లాక్ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తూ గ్లామర్ డోస్ పెంచేసింది. ఫిల్మ్ ఫేర్ మిడిల్ ఈస్ట్ సోషల్ ఈవెంట్ కోసం పోటీ పడి వేసుకున్న బ్లాక్ కాస్ట్యూమ్స్ లో నోరా, శ్రద్ధాకపూర్ హాట్ హాట్ లుక్ లో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. శ్రద్ధాకపూర్ , నోరా మధ్య ఉన్న కామన్ థింగ్ ఏంటంటే, ఇద్దరూ మంచి యాక్టర్స్ , డ్యాన్సర్లు. ఈ ఇద్దరు సుందరీమణులు స్ట్రీట్ డ్యాన్సర్ 3డీలో పోటీపడి మరి నటించారు. ఈ ముద్దుగుమ్మల్లో ఎవరు ఎక్కువ హాట్ గా ఉన్నారో చెప్పుకోండి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.