తుపాకితో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య !

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నగరంలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాహుల్ సింగ్ (31) తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ ఐ మృతదేహం వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని, ఎస్ ఐ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఢిల్లీ ఈస్ట్ విభాగం డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రియాంకా కశ్యప్ పేర్కొన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ఎస్ఐ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

ads