గిద్దలూరు లో విచిత్ర సంఘటన

ప్రకాశం జిల్లా: జిల్లాలోని గిద్దలూరు లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఎల్ఈడీ టీవీ లో పాము దూరి మృతి చెందింది. దిగువమెట్ట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రముఖ కంపెనీ ఎల్ఈడీ టీవీ ఇటీవల చెడిపోయింది. దీంతో టీవీ ని రిపేరు చేయించుకునేందుకు గిద్దలూరుకు తీసుకెళ్లాడు. రిపేరు చేసేందుకు టీవీ ని విప్పిన మెకానిక్​ ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆ టీవీ లో పాము దూరడం వల్ల విద్యుత్ షాక్​ గురై పాము మృతి చెందింది అని గుర్తించాడు. పాము మృతి చెందుతున్న సమయంలో టీవీ లో ఉన్న సంబంధిత బోర్డు షార్ట్ సర్క్యూట్ అయి సాంకేతిక లోపం తలెత్తింది అని చెప్పారు. అందు వల్ల టీవీ చెడిపోయింది అని మెకానిక్ తెలిపారు. ఇది చూసిన టీవీ యజమాని కూడా ఒక్కసారిగా కంగు తిని టీవీ లో పాము ఎలా వెళ్లిందో.. అర్థం కావడం లేదని అయోమయంలో పడ్డాడు.