భర్త కేసు నుంచి శిల్పాశెట్టికి ఊరట

ముంబై : వివాదాస్పద నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ప్రస్తుతం జైలులో ఉన్నాడు. రాజ్ కుంద్రాను రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రాజ్ కుంద్రా కేసులో అతని భార్య శిల్పాశెట్టి పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ కేసు నుంచి శిల్పాశెట్టికి ఊరట లభించింది. ఈ కేసులో శిల్పాశెట్టికి ముంబై పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు.

ads

శిల్పాశెట్టికి సంబంధం లేకుండానే రాజ్ కుంద్రా వ్యవహారం కొనసాగిందని, యూకేకు చెందిన యాప్ అండదండలతోనే రాజ్ కుంద్రా పోర్న్ ఫిలిమ్స్ వ్యవహారం నడిపించాడని ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అయితే మరోవైపు పోర్స్ కేసులో అరెస్టైన రాజ్ కుంద్రా ముందస్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నాడు.