ఐసీసీ ర్యాంకింగ్స్​లో దూసుకెళ్లారు

దుబాయ్​ : ప్రజెంట్​ ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్ట్​ సిరీస్​లో అద్భుతంగా రాణిస్తున్న ఓపెనర్​ రోహిత్​ శర్మ, ఆల్​రౌండర్​ అశ్విన్​లు ఐసీసీ ర్యాంకింగ్స్​లో దూసుకెళ్లారు. తాజా గా వచ్చిన ర్యాంకింగ్స్​లో ఈ ఇద్దరూ పైకి ఎగబాకారు. చెన్నై టెస్ట్​లో సెంచరీ కొట్టిన రోహిత్​ టాప్​ టెన్​లో నిలిచాడు. ఆరు స్థానాలు మెరుగు పరుచుకొని 8వ ర్యాంకులో నిలిచాడు. అటు సిరీస్​లో ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అదరగొడుతున్న అశ్విన్​, బౌలర్ల ర్యాంకులో మూడో స్థానానికి ఎగబాకాడు. బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ టాప్​లో కొనసాగుతున్నాడు. భారత్​ కెప్టెన్ విరాట్​ కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. ఇటు బౌలర్లలో ఆసీస్​ పేసర్​ ప్యాట్​ కమిన్స్​ టాప్​లో ఉన్నాడు.

ads