ఇతను ఏం చేశాడో తెలుసా..చదివితే షాక్ అవుతారు..!

ముంబై : దాదాపు ఈ యేడాది కాలంగా కరోనా కష్టకాలంలో ఎంతో మంది కష్టాలను తీరుస్తూ, కన్నీళ్లను తుడుస్తున్న రియల్ హీరో సోనూసూద్ ని అభిమానించని వారెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న గొప్ప మనసున్న హీరో సోనూసూద్ కు బాధితులతో పాటు, జనం తమ గుండెల్లో గుడి కట్టారు. ఇందులో భాగంగా ఈ రియల్ హీరోను కలిసేందుకు ఓ అభిమాని పెద్ద సాహసమే చేశాడు.హైదరాబాద్ టూ ముంబై ప్రయాణం
తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పరిగి మండలం దోర్నాలపల్లికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి వెంకటేశ్ సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను చూసి అతనికి అభిమానిగా మారిపోయాడు. ఏదిఏమైనా సోనూసూద్ ని కలవాలని డిసైడ్ అయ్యాడు. సోనూ సూద్ కోసం ఏకంగా ముంబైకి పాదయాత్ర మొదలుపెట్టాడు. జూన్ 2న హైదరాబాద్ నుంచి ముంబైకి 65 నంబర్ జాతీయ రహదారిపై జహీరాబాద్ మీదుగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. చేతిలో సోనూసూద్ ఫోటోతో ఉన్న ప్లకార్డు పట్టుకుని, కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే కాలినడకన ముంబై బయల్దేరాడు. అలా 700 కి.మీ. దూరం నడిచి ఎట్టకేలకు ముంబైలోని సోనూ నివాసానికి చేరుకున్నాడు.

ads

స్పందించిన సోనూసూద్
తనను కలిసేందుకు వచ్చిన వీరాభిమాని వెంకటేశ్ ను సోనూసూద్ సాదరంగా తన నివాసంలోకి ఆహ్వానించాడు. అతని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. వెంకటేశ్ తో దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ” వెంకటేశ్ నన్ను కలిసేందుకు కాలినడకన హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చాడు. నిజానికి వెంకటేశ్ కోసం ఏదైనా ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ.. అతను మాత్రం కాలినడకనే వచ్చాడు. వెంకటేశ్ స్ఫూర్తిని నన్ను గర్వపడేలా చేస్తోంది. అయితే ఇలాంటి సాహసాలను నేను ప్రోత్సహించి అభిమానులను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.” అని సోనూ సూద్ స్పష్టం చేశాడు.