కరోనా బారిన నటుడు సోనూసూద్

ముంబై : ప్రముఖ నటుడు3, కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేదలకు ఆర్ధికంగా సాయంచేసిన మానవాతావాది సోనూసూద్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఉదయం ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ఇంగ్లీష్ , హిందీ రెండు భాషల్లో ఒక ప్రకటన చేశారు.

ads

‘కొవిడ్ -పాజిటివ్ , మూడ్ & స్పిరిట్ – సూపర్ పాజిటివ్. అందరికీ హాయ్, ఈ ఉడయం నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ముందుజాగ్రత్త చర్యగా నేను ఇప్పటికే సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉన్నా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎవరూ ఆందోళన చెందవద్దు. దీనివల్ల మీ సమస్యల పరిష్కారం కోసం నాకు చాలా సమయం దొరుకుతుంది. నేను మీ అందరివాడిని అనే విషయం గుర్తుపెట్టుకోండి’ అని సోనూసూద్ తన ప్రకటనలో పేర్కొన్నారు.