దాదాకు మళ్లీ ఛాతిలో నొప్పి

కోల్‎కతా : బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మరోసారి ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను వెంటనే కోల్‎కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి అనారోగ్యానికి గురైన గంగూలీ బుధవారం మధ్యాహ్నం మరోసారి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈ మధ్యే దాదాకు గుండె‎పోటు రావడంతో కోల్‎కతాలోని వుడ్‎ల్యాండ్ హాస్పిటల్‎లో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్న గంగూలీ తర్వాత ఇంటికి వచ్చారు.