మహిళా ఉద్యోగులపై సీఎం ప్రత్యేక చొరవ

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం సందర్భంగా భోజన విరామ సమయంలో సీఎం కేసీఆర్ మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడారు. శాఖల వారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులతో మాట్లాడి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసే బాధ్యతను తన కార్యదర్శి స్మితా సభర్వాల్ కు సీఎం అప్పగించారు. తమ పట్ల సీఎం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకు మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.