కాచిగూడ,కాజీపేట మీదుగా రిషికేశ్కు ప్రత్యేక రైళ్లు

కాచిగూడ,కాజీపేట మీదుగా రిషికేశ్ కు ప్రత్యేక రైళ్లు

వరంగల్ టైమ్స్, దక్షిణ మధ్య రైల్వే : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని కాచిగూడ,కాజీపేట రైల్వే స్టేషన్ల మీదుగా ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. యశ్వంత్ పూర్-యోగ్ నగరి రిషికేశ్ (06597) కు ప్రతి గురువారం రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ రైలు గురువారం ఉదయం 7 గంటలకు రిషికేశ్ బయల్దేరి ఆదివారం గమ్యస్థానం చేరుతుంది. ఈ రైలు కాచిగూడలో రాత్రి 8.50 గంటలకు, కాజీపేటలో 11.33 గంటలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

రిషికేశ్ యశ్వంత్ పూర్(06598) రైలు ప్రతి ఆదివారం నడుస్తుంది.ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు రెండు మార్గాల్లో యెలహంక జంక్షన్, హిందూపూర్, ధర్మవరం, అనంతపురం,డోన్, కర్నూలు సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లర్షా,నాగ్ పూర్, భోపాల్, బినా జంక్షన్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, మధుర, నిజాముద్దీన్, ఘజియాబాద్, మీరట్, ముజఫర్ నగర్, తాప్రి,రూర్కీ, హరిద్వార్ స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది. ఈ రైలులో ఫస్ట్ క్లాస్ ఏసీ, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉన్నాయని వివరించింది.