ఫైట్ ఎగైనెస్ట్ అనేమియా

మహబూబ్ నగర్ జిల్లా : ఫైట్ ఎగైనెస్ట్ అనేమియా నిర్మూలన కోసం ‘Give me Red’ పేరుతో రవి చిల్డ్రన్స్​ ఆస్పత్రి ఫర్​ ది ప్లాగింగ్​ ఆఫ్​ 500 కి. మీ సైకిల్​ ర్యాలీని ఏర్పాటు చేసింది. ఈ ర్యాలీని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్​ వెంకటరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు రవి హాస్పిటల్ సిబ్బంది, పాల్గొన్నారు.