సిబ్బంది పనితీరు అభినందనీయం

వరంగల్​ అర్బన్​ జిల్లా : చోరీలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో సీసీఎస్ విభాగం అధికారులు, సిబ్బంది పనితీరు అభినందనీయమని వరంగల్ సీపీ ప్రమోద్​కుమార్​ అన్నారు. గత నెల ధర్మసాగర్ మండల కేంద్రంలో వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్​ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. సెంట్రల్ జోన్ ఇన్​చార్జి డీసీపీ పుష్పా, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ రమేష్ కుమార్, ఏఎస్సై వీరస్వామి, హెడ్ కానిస్టేబుల్ ఇనాయత్ ఆలీ, వంశీ, చంద్రశేఖర్, విశ్వేశ్వర్ ను సీపీ శుక్రవారం అభినందించారు.

ads

‘ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. చోరీకి గురైన సొత్తును కనిపెట్టి భాధితులకు అప్పగించడం ద్వారా ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరుగుతుందని సీపీ చెప్పారు. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో చోరీలను నియంత్రించేందుకుగాను సీసీఎస్ విభాగాం ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవాలని సీపీ సూచించారు. ఇందుకోసం ఇతర జిల్లాల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కిన నేరస్థుల సమాచారాన్ని సేకరించాలన్నారు. అలాగే వివిధ జైళ్లనుంచి విడుదలైన దొంగల వివరాలను తెలుసుకుని వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. దీని ద్వారా చోరీలు జరుగకుండా నియంత్రించడంలో మరింత విజయం సాధించగలమని’సీపీ ప్రమోద్​కుమర్​ వెల్లడించారు.