ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వరంగల్ అర్బన్ జిల్లా :ఈ నెల 3 న జరిగే ఓట్ల లెక్కింపుకు పక్కడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారి, అర్బన్ జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి తో కలసి రాంపూర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఓట్ల కౌంటింగ్ కు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో మరింత పక్కాగా ఏర్పాట్లు చేయడానికి పలు సూచనలు చేశారు. కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లకు కౌంటింగ్ కు 3 బ్లాక్ లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఆయా బ్లాక్ లకు సమీపంలోనే 6 స్ట్రాంగ్ రూమ్ లలో బాలట్ బాక్స్ లను భద్రపరిచామని అన్నారు.ప్రతీ గదిలో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా బారికేడ్లు, సిసి కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కౌంటింగ్ సిబ్బందికి, ఎలక్షన్ ఏజెంట్లకు గదుల్లోకి వెళ్లుటకు ప్రత్యేక దారులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరుగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఆర్డీఓ వాసు చంద్ర, బల్దియా ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఈ ఈ లు, డి ఈ లు, తదితరులు పాల్గొన్నారు.

ads