తొలి విడతలో బీజేపీకి మొండిచేయే

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో 30 అసెంబ్లీ స్థానాలకుగాను 26 స్థానాలు కాషాయ పార్టీకి వస్తాయని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఎద్దేవా చేశారు. తొలి దశ ఎన్నికల్లో బీజేపీకి సున్నా స్థానాలు దక్కుతాయని అన్నారు. చందీపూర్ లో జరిగిన ప్రచార ర్యాలీని ఉద్దేశించి దీదీ మాట్లాడుతూ బీజేపీకి పెద్ద రసగుల్లా(జీరో) వస్తుందని వ్యాఖ్యానించారు. బెంగాల్ ఎన్నికలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా జరిగేలా వ్యవహరించాలని కేంద్ర బలగాలను ఆమె కోరారు.

ads

రాబోయే పలు దశల పోలింగ్ పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ ఓటర్లను మభ్యపెట్టేలా వ్యవహరించవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు అమిత్ షాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బ్లఫ్ మాస్టర్ గా అభివర్ణించారు. బెంగాల్ లో మైండ్ గేమ్స్ పనిచేయవని, గుజరాత్ లో ఈ జోస్యాలు చెప్పుకోవాలని అమిత్ షాకు తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెన్ సూచించారు.