ఒంగోలులో విషాదం

ప్రకాశం జిల్లా : ఒంగోలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. కళాశాల ఫీజు కట్టలేమని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్థాపం చెందిన విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఓ కాలేజీలో బీటెక్​ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతుంది తేజస్వీ. అయితే ఆమెకు రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్​మెంట్​ రాలేదు. ఈ క్రమంలో కళాశాల ఫీజు కట్టాలని తల్లిదండ్రులను కోరింది.. ఫీజు కట్టే స్తోమత తమ వద్ద లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన తేజస్వీ రాత్రి సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.