సుధీర్, కృతి మూవీ స్టార్ట్

హైదరాబాద్​ : `సమ్మోహనం`, `వి` తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్​లో మూడో చిత్రం రూపొందుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శ‌కుడు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం. ఈ చిత్రం ఈ రోజు హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి వీవీ వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, మైత్రి మూవీ మేక‌ర్స్ వై. ర‌విశంక‌ర్ కెమెరా స్విఛాన్​ చేశారు. నిర్మాత దిల్‌రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వెంకీ కుడుముల స్క్రిప్ట్‌ను మేక‌ర్స్‌కి అంద‌జేశారు. ఇంకా పేరు పెట్ట‌ని ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. గాజుల ప‌ల్లి సుధీర్‌బాబు స‌మ‌ర్ఫ‌ణ‌లో బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై బీ మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.