ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

యాదాద్రి భువనగిరి జిల్లా : మూటకొండూర్ (మం) కాటేపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ లోనే బస్సు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు ఫిట్ నెస్ లేకపోవడమే ప్రమాదానికి గల కారణమని డ్రైవర్ తెలిపారు. తాను అప్రమత్తంగా ఉండటం వల్లే పెను ప్రమాదం తప్పిందని అన్నారు. అయితే ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు మాత్రం ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ads