తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు సీజే

తిరుమ‌ల‌: గురువారం రాత్రి తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహంనకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి.రమణకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలితకుమారి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ పవన్‌కుమార్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, అనంతపురం డిఐజి కాంతిరాణా టాటా, సివిఎస్‌ఓ గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి త‌దిత‌రులు ఘన స్వాగతం పలికారు.

ads