న్యూఢిల్లీ: ట్విటర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ట్విటర్, మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఫేక్ న్యూస్, విద్వేష సందేశాలు , దేశద్రోహ సందేశాలపై నిఘా ఉంచడానికి ఓ విధానాన్ని రూపొందించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చింది.
బీజేపీ నేత వినీత్ గోయెంకా గతేడాది మే లో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ట్విటర్ కంటెంట్‌తో పాటు నకిలీ వార్తల ద్వారా విద్వేషాన్ని వ్యాపింపజేసే ప్రకటనలపై నిఘా ఉంచడానికి ఓ విధానాన్ని రూపొందించాలని ఈ పిటిషన్లో ఆయన కోరారు. ప్రముఖ వ్యక్తుల పేరు మీద ట్విటర్, ఫేస్‌బుక్‌లలో వందల సంఖ్యలో నకిలీ అకౌంట్లు ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రైతుల ఉద్యమంపై దుష్ప్రచారం చేస్తున్న అకౌంట్లను బ్లాక్ చేయాలని ట్విటర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సమయంలోనే ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కూడా విచారణ చేపట్టింది.