పదవీ విరమణ చేసిన సురేష్ చందా

హైదరాబాద్ : ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సురేష్ చందా, ఐఎఎస్ కు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షత వహించారు. సురేష్ చందాను మెమెంటో, శాలువాతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్కరించారు. సురేష్ చందా చేసిన సేవలకు ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృతజ్ఞతలు తెలిపారు. సంతోషకరమైన, ప్రశాంతమైన మరియు చురుకైన పదవీ విరమణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

ads

ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ యం.డి, దాన కిషోర్, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ పలువురు ఐ.ఎ.ఎస్. అధికారులు పాల్గొన్నారు.