శ్రేయస్ అయ్యర్ కు సర్జరీ..

న్యూఢిల్లీ : ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో ఇండియా బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ ఎడమ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న అయ్యర్ భుజానికి శస్త్ర చికిత్స చేయనున్నారు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 5 నెలల పట్టే అవకాశం ఉంది. గాయం కారణంగా అయ్యర్ ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు దూరంకానున్నాడు. అతడు కోలుకోవడానికి 4 నుంచి 5 నెలలు పడుతుందని తెలిసింది. సొంతగడ్డపై సెప్టెంబర్ లో న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లకు అతడు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అయ్యర్ స్థానంలో యాజమాన్యం కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది.

ads