కుప్పకూలిన స్టేడియం గ్యాలరీ..

సూర్యాపేట జిల్లా : జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టేడియంలోని మూడో నెంబర్ గ్యాలరీ కుప్పకూలి 100 మంది యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ఘటనతో అంతా ఉలిక్కి పడ్డారు. 47వ జాతీయ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమైన కాసేపటికే ఈ ఘటన జరిగింది. జాతీయ క్రీడల కోసం నిర్వాహకులు స్టేడియంలో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ ఘటన జరగడంతో రెయిలింగ్‌ కింద పలువురు ప్రేక్షకులు ఇరుక్కుపోయారు. స్టేడియం గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ads