విజయవాడ : విజయవాడ దుర్గ గుడిలో పనిచేసే ఐదుగురు సూపరింటెండెంట్లు సహా 13 మంది ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు పడింది. గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందించింది. గుడిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అందజేసిన నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్‌బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.