టీ20 ర్యాంకింగ్స్

దుబాయ్ : ఇండియన్ బ్యాట్స్‎మెన్ కేఎల్ రాహుల్ తాజా టీ20 ర్యాంకింగ్స్‎లో 816 పాయింట్లతో తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అటు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగుపరుచుకుని 697 పాయింట్లతో ఆరోస్థానానికి చేరాడు. అటు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టీ20ల్లో రాణించిన న్యూజిలాండ్ బ్యాట్స్‎మెన్ డెవోన్ కాన్వే, మార్టిన్ గప్టిల్ ఈ తాజా ర్యాంకింగ్స్‎లో మెరుగైన ర్యాంకులు సాధించారు. తొలి టీ20లో 99 పరుగులు చేసిన కాన్వే ఏకంగా 46 స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో నిలిచాడు. రెండో టీ20లో 97 పరుగులు చేసిన గప్టిల్ మూడు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకు సాధించాడు.

ads